లండన్ లో బాహుబలి టీమ్

Baahubali to be Played at London Royal Albert Theater,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,London Royal Albert Theater,Baahubali Movie Latest News 2019

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన బాహుబలి -ది బిగినింగ్ ఘనవిజయం సాధించి అనేక రికార్డ్స్ నెలకొల్పి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ బాహుబలి – ది కంక్లూజన్ రూపొంది రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి ప్రపంచ వ్యాప్తం గా తెలుగు మూవీ ఘనతను చాటి చెప్పింది. ఇప్పుడు మరొక అరుదైన రికార్డ్ ను సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ థియేటర్ దశాబ్దాల కాలంగా సాంస్కృతిక, కళల ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేస్తారు . ఈ సంవత్సరం బాహుబలి -ది బిగినింగ్ మూవీ తోపాటు హ్యారీ పోటర్, స్కై ఫాల్ మూవీస్ ప్రదర్శించబడనున్నాయి. ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే ప్రదర్శించ బడే ఈ థియేటర్ లో ఫస్ట్ టైమ్ ఒక తెలుగు మూవీ ప్రదర్శించబడటం విశేషం. ఈ రోజు (19వ తేదీ ) బాహుబలి-ది బిగినింగ్ మూవీ స్క్రీనింగ్ తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్ర నేపథ్య సంగీతాన్ని లైవ్ ఆర్కెస్ట్రా తో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా బాహుబలి మూవీ టీమ్ లండన్ కు చేరుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =