అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రానుంది. ఇక ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్), మెర్సల్(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక అదే రోజున ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమా లో విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులు ఈస్ట్ కోస్ట్ బ్యానర్ దక్కించుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఇందులో మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో రాజప్ప అనే మాస్ పాత్రలోను .. మైఖేల్ అనే ఫుట్ బాల్ కోచ్ పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: