ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పొలిటిక‌ల్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి 7 ఏళ్ళు

Pawan Kalyan Cameraman Gangatho Rambabu Movie Completes 7 Years,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,7 Years For Cameraman Gangatho Rambabu Movie,Pawan Kalyan Cameraman Gangatho Rambabu Movie,Cameraman Gangatho Rambabu Telugu Movie

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రూపొందిన ఫస్ట్ పొలిటికల్ బేస్డ్‌ ఫిల్మ్. జ‌ర్న‌లిస్ట్ గా ట‌ర్న్ అయిన `రాంబాబు` అనే ఓ మెకానిక్‌… అవినీతిప‌రులైన రాజ‌కీయ నాయ‌కుల‌పై సాగించే పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో ప‌వ‌న్ చెప్పిన‌ ప‌లు డైలాగ్స్‌ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బ‌ద్రి’(2000) త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించిన ఈ ప‌వ‌ర్‌ఫుల్ మూవీలో… కెమెరామెన్ `గంగ‌` పాత్ర‌ను తమన్నా పోషించింది. గేబ్రియాలా బెర్టంటే, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, నాజర్, సూర్య, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి, శ్రుతి తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించగా… స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక గీతంలో నర్తించింది.

భాస్కర్ భట్ల కలం నుంచి జాలువారిన పాటలకు… “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరాలు అందించారు. “మెలికలు”, “ఎక్స్‌ట్రార్డిన‌రీ”, “పిల్లని చూస్తే”, “జొరమొచ్చింది”, “తలదించుకు”… ఇలా ఇందులోని అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రించాయి. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 2012 అక్టోబర్ 18న విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’… నేటితో 7 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 7 =