మిక్కీ జే మేయ‌ర్‌… హ్యాట్రిక్‌కి వేళాయే

Latest Telugu Movies News, Melody King Mickey J Meyer, Mickey J Meyer Ready For Hat Trick Hit, Mickey J Meyer Songs, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Tollywood Music Director Mickey J Meyer

మెలోడీ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన మ్యూజిక్ కంపోజ‌ర్స్‌లో మిక్కీ జే మేయ‌ర్ ఒక‌రు. 14 ఏళ్ళుగా స్వ‌ర‌క‌ర్త‌గా రాణిస్తున్న మిక్కీ… ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో త‌నదైన `బాణీ` ప‌లికించాడు. అలాగే ప‌లు పుర‌స్కారాల‌ను త‌న కైవ‌సం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే… ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న మిక్కీ… ఇప్పుడు హ్యాట్రిక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఈ ఏడాది ద్వితీయార్ధంలో `ఓ బేబీ`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` (వాల్మీకి) వంటి రెండు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు స్వ‌రాలు అందించిన‌ మిక్కీ… న‌వంబ‌ర్‌లో `ఇద్ద‌రి లోకం ఒక‌టే`తో సంద‌డి చేయ‌నున్నాడు. రాజ్ త‌రుణ్‌, షాలినీ పాండే జంట‌గా `దిల్‌` రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి జి.ఆర్‌. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ `యూ ఆర్ మై హార్ట్ బీట్‌` ఇంప్రెస్ చేయ‌డంతో… మిక్కీ ఈ సినిమాతోనూ మ‌రో స‌క్సెస్ చూడ‌డం ఖాయ‌మ‌ని వినిపిస్తోంది. మ‌రి… మిక్కీ ఖాతాలో ఈ ఏడాది హ్యాట్రిక్ చేరుతుందో లేదో తెలియాలంటే న‌వంబ‌ర్ వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =