కార్తీ ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Khaidi movie Pre Release Event date Fixed,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi movie Pre Release Event,Khaidi Pre Release Event date,Khaidi movie Updates

‘మా న‌గ‌రం’ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగకే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 20వ తేదీన మాదాపూర్ లోని దస్పల్లా కన్వెన్షన్ లో నిర్వహించనున్నారు.

ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేనట్టు తెలుస్తుంది. అంతే కాదు 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =