సంక్రాంతి సీజన్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే… ఇప్పటివరకు రెండు చిత్రాలతో ముగ్గుల పండక్కి సందడి చేసిన బన్నీకి… రెండు సందర్భాల్లోనూ మంచి విజయాలే దక్కాయి. ఈ నేపథ్యంలో… `అల వైకుంఠపురములో`తో ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గత రెండు సందర్భాల్లో ఏ తేదికైతే బన్నీ చిత్రాలు విడుదలయ్యాయో… సరిగ్గా అదే తేదికి తన నెక్ట్స్ వెంచర్ కూడా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సంక్రాంతి సీజన్లో అల్లు అర్జున్ నుంచి వచ్చిన తొలి చిత్రం `దేశముదురు` (2007), అతిథి పాత్రలో సందడి చేసిన `ఎవడు` (2014) ఆ యా సంవత్సరాల్లో జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించాయి. కట్ చేస్తే… ఇప్పుడదే తేదిని టార్గెట్ చేసుకుని బన్నీ `అల వైకుంఠపురములో` కూడా రాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి… లక్కీ డేట్‌కి వస్తున్న బన్నీకి సంక్రాంతి సీజన్లో ముచ్చటగా మూడో విజయం దక్కుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: