ప్రభుదేవా సినిమాతో శ్రీకాంత్ చిన్న కొడుకు ఎంట్రీ

Srikanth Younger Son to Make Entry in Tollywood,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Srikanth Younger Son Tollywood Entry in Prabhu deva Movie,Srikanth Younger Son,Prabhu Deva New Movie Updates

విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఎన్నో సినిమాలు చేశారు శ్రీకాంత్. ఇక ఇప్పుడు తన కొడుకులను సెటిల్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే పెద్ద కొడుకు రోషన్ వెండితెరకు పరిచయమయ్యాడు. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు చిన్న కొడుకు రోహన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ డాన్స్ మాస్టర్, హీరో ప్రభుదేవా, మమత మోహన్ దాస్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతుంది. హార్రర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోహన్ ప్రభుదేవా కొడుకుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి రోహన్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.. నా చిన్నప్పుడు మా నాన్న షూటింగ్ సెట్స్ కి వెళ్లి చూసేవాడిని.. తర్వాత అన్నయ్య సినిమా షూట్ కి వెళ్లాను.. ఫైనల్లీ ఇప్పుడు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పాడు. అంతేకాదు సెట్ లో అందరికంటే తానే చిన్నవాడినని.. అందుకే తనను అందరు పెంపర్ చేసేవారని.. ఒకవేళ ఏదైనా సీన్ చేయలేకపోతే డైరెక్టర్ రెండుమూడు సార్లు చెప్పేవాడు.. లేకపోతే అమ్మకు చెప్తే తాను నాకు చెప్పేది అని చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ వీఎస్ మాట్లాడుతూ.. గతంలో చూసిన హార్రర్ సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని తెలిపాడు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా వస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =