సన్నీ లియోన్ తో ఛాన్స్ కొట్టేసిన నవదీప్

Navdeep to Work with Sunny Leone,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Navdeep to work with Bollywood Actress Sunny Leone,Tollywood Actor Navdeep Latest News,Sunny Leone New Movie

హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరో సరైన సినిమాలు నవదీప్ కు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్.. అల వైకుంఠపుములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇక్కడ ఛాన్స్ దక్కకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఓ బంపర్ ఆఫర్ కొట్టేసాడు నవదీప్. అది కూడా మామూలు ఆఫర్ కాదు ఏకంగా సన్నీ లియోన్ తో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నాడు. బాలీవుడ్‌లో వచ్చిన రాగిణి ఎంఎంఎస్‌ రిటర్న్స్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో నవదీప్‌ సన్నీతో కలిసి నటిస్తున్నారు. బాలాజీ టెలీఫిల్మ్స్‌ పై ఏక్తాకపూర్‌ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది. ఇక ఈ సందర్భంగా షూటింగ్‌ లొకేషన్‌లో సన్నీతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. మీతో కలిసి నటించడం అనందంగా ఉంది అంటూ మీరు చాలా ఫన్నీగా ఉంటారని కామెంట్‌ పెట్టాడు.

ఇక నవదీప్ పోస్ట్ పై పలువురు నెటిజన్లు స్పందించి.. బలే ఛాన్స్ కొట్టేయారని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి సన్నీ కాంబినేషన్‌ కాబట్టి నవదీప్‌కు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు రావొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 2 =