తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్

Manchu Manoj Gives Clarity on his Divorce,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Manchu Manoj About Divorce,Actor Manchu Manoj Divorce,Manchu Manoj Responds On Divorce

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా పడలేదని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం గత కొద్దికాలం గా సినిమాలకు కూడా దూరంగానే ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే మనోజ్ వైవాహిక జీవితంపై కూడా కొద్ది రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. మనోజ్, తన భార్య విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మనోజ్ ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆయన తన భార్య విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తనకు విడాకులు మంజూరయ్యాయని, ఎంతో అందంగా అల్లుకున్న బంధం ముగిసిందని చెప్పడానికి హృదయం బరువెక్కిపోతోందని వ్యాఖ్యానించారు. మేము మా వివాహ బంధానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం. ఇది బాధకలిగించే అంశం ఐనప్పటికీ ఒకరి మనో భావాలను మరొకరు గౌరవించే వారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకరి వ్యక్తిగత జీవితం పట్ల మరొకరికి మాకు గౌవరం వుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది.. ఈ కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా వెంటనిలిచింది అభిమానులేనని మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో సమస్యలు తొలగిపోయాయని భావిస్తున్నానని, ఇకమీదట తనకెంతో ఇష్టమైన సినిమా రంగంలోకి మళ్లీ వచ్చేస్తున్నానని ప్రకటించారు.

కాగా 2015లో ప్రణీత రెడ్డిని మంచు మనోజ్ పెద్దల సమ్మతితో పెళ్లిచేసుకోవడం జరిగింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =