వయా కామ్ 18 స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్స్ పై స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా, సూపర్ హిట్ మూవీ ఇమైక్క నోడిగళ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రియా భవాని శంకర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకునే హీరో చియాన్ విక్రమ్ ఈ మూవీ లో 25 గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ KGF చాప్టర్ 1 తో శ్రీనిధి శెట్టి శాండల్ వుడ్ కు పరిచయమయ్యారు. విక్రమ్ 58 మూవీ తో కోలీవుడ్ కు ఎంటరవుతున్నారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ మూవీ తో నటుడిగా కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు. దర్శకుడు అజయ్ ఇమైక్క నోడిగళ్ మూవీ ని ఆసక్తికరంగా రూపొందించారని, తాను ఆయనకు అభిమానిగా మారానని , విక్రమ్ 58 మూవీ లో అవకాశం రావడం ఆనందంగా ఉందనిశ్రీనిధి శెట్టి తెలిపారు. ప్రస్తుతం చెన్నై లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 2020 లో రిలీజ్ కానుంది .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: