కుకునూర్‌ స్పోర్ట్స్ డ్రామా – కీర్తి సురేష్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ మరో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ డైరెక్టర్ నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరున్న నగేశ్‌ కుకునూర్‌ మొదటిసారి తెలుగులో ప్రయత్నిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 8 గంటలకు ఈ సినిమా నుండి కీర్తి సురేష్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ ను దీపావళి కి రిలీజ్ చేయనున్నారు.

కాగా స్పోర్ట్స్‌ రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ తోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షార్ట్‌ మోషన్‌ పోస్టర్‌ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్‌ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్‌ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. చిరంతన్‌ దాస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 14 =