చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘96’ రీమేక్

Samantha Wraps Up Shooting For 96 Movie Remake,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,96 Movie Remake Shooting Details,Samantha 96 Movie Remake Updates,96 Movie Remake Latest News

పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలచుకోవడం సమంత స్టైల్. అందుకే టాలీవుడ్, కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పలు విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవల ‘ఓ బేబీ’తో మరో ఘనవిజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై బ్యూటీ… ప్రస్తుతం ’96’ రీమేక్‌లో నాయికగా నటిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తుండగా… ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో చిత్రీకరణను పూర్తి చేసుకుందీ చిత్రం. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. ఈ సందర్భంగా… ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందనీ, మరో ప్రత్యేకమైన సినిమాలో తనకు సవాల్ విసిరిన మరో ప్రత్యేకమైన పాత్రలో నటించానని తెలిపింది సామ్. నిన్నటి కంటే ఉత్తమంగా తనను ‘జాను’ పాత్ర మార్చేసిందని… అత్యుత్తమ జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొంది. ‘96’ వంటి డ్రీమ్ టీమ్‌తో కలసి పని చేయడం ఆనందంగా ఉందని… దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో పాటు… సహ నటుడు శర్వానంద్‌కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేసింది సమంత.

కాగా… ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కు ‘జాను’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే… క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =