మ్యూజికల్ హిట్… ‘క్రిమినల్’కు పాతికేళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘క్రిమినల్’ ఒకటి. నాగ్‌కు జోడీగా మనీషా కోయిరాలా, రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నాజర్, శరత్‌బాబు, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుధ, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫ్యుజిటివ్’(1993) స్ఫూర్తితో ‘క్రిమినల్’ను తెరకెక్కించాడు బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, వెన్నెలకంటి గీత రచన చేయగా… స్వరవాణి కీరవాణి వీనుల విందైన బాణీలు అందించారు. ఇందులోని అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా “తెలుసా మనసా” ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని… తెలుగులో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మించగా… హిందీలో ముఖేష్ భట్ నిర్మించాడు. 1994 అక్టోబర్ 14న విడుదలైన ‘క్రిమినల్’… నేటితో పాతిక వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =