మ్యూజిక‌ల్ హిట్‌ ‘బాలగోపాలుడు’కు 30 ఏళ్ళు

30 Years for Chiranjeevi Musical Hit Bala Gopaludu,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiranjeevi Musical Hit Bala Gopaludu Completed 30 Years,30 Years for Bala Gopaludu,Bala Gopaludu Telugu Movie

నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు… అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజిక‌ల్ హిట్స్‌గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బాలగోపాలుడు’ ఒకటి. బాలకృష్ణ జోడీగా సుహాసిని నటించగా రేఖ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, జగ్గయ్య, మోహన్‌బాబు, గిరిబాబు, మల్లికార్జునరావు, సంయుక్త, మాస్టర్ కళ్యాణ్‌రామ్, బేబి విజ‌య (రాశి) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పి.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఆర్.వి.ప్రసాద్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి గీత ర‌చ‌న‌లో రాజ్-కోటి స్వరపరచిన పాటలన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలచాయి. “బావా బావా బంతీపువ్వా”, “ఒకటే తనువంతా”, “సువ్వి సువ్వి”, “డోంట్ వర్రీ బీ హ్యాపీ”, “సిటిక మీద సిటికలై”, “చక్కనమ్మ పక్కనుంటే” … ఇలా ప్రతీ పాట అప్పట్లో శ్రోతలను ఉర్రూతలూగించింది. 1989 అక్టోబర్ 13న విడుదలై విజయకేతనం ఎగురవేసిన ‘బాలగోపాలుడు’… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘బాలగోపాలుడు’ – కొన్ని విశేషాలు:
* ‘మంగమ్మగారి మనవడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణ, సుహాసిని జంటగా కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రం `బాల గోపాలుడు`.
* చలనచిత్ర చరిత్రలో విడుదలకు ముందే పాటలకు `గోల్డ్ డిస్క్` పొందిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించిన సినిమా `బాల గోపాలుడు`.
* ఆంధ్రప్రదేశ్‌లో పది రోజులకు గాను 4615 షోలు హౌస్ ఫుల్స్ అయి హౌస్ ఫుల్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించడ‌మే కాకుండా… ఆ పది రోజుల్లో 1,02,14,560/- షేర్ వసూల్ చేసి చరిత్ర సృష్టించింది `బాల గోపాలుడు`.
* `బాల గోపాలుడు`తోనే బాలనటుడిగా కళ్యాణ్ రామ్ తొలి అడుగులు వేశాడు. క‌ట్ చేస్తే.. 30 ఏళ్ళ త‌రువాత `య‌న్టీఆర్‌` బ‌యోపిక్ కోసం బాల‌కృష్ణ‌తో మ‌రోసారి క‌ల‌సి న‌టించాడు క‌ళ్యాణ్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 20 =