ట్రెండ్ సెట్టింగ్‌ మూవీ ‘నువ్వేకావాలి’కి 19 ఏళ్ళు

19 Years for Trend Setting Movie Nuvve Kavali,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Trend Setting Movie Nuvve Kavali Completes 19 Years,19 Years for Nuvve Kavali Movie,Nuvve Kavali Telugu Movie

తెలుగునాట పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాలు సందడి చేసాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ట్రెండ్‌ను సృష్టించాయి. అలా… ట్రెండ్ సెట్టర్‌గా నిలచిన చిత్రాలలో ముందు వరుసలో ఉండే సినిమా ‘నువ్వేకావాలి’. ప్రేమకథా చిత్రాల ప‌రంగా కొత్త ఒరవడిని సృష్టించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తరుణ్, రిచా జంటగా నటించ‌గా… సాయి కిరణ్, వర్ష, గిరిబాబు, చలపతిరావు, సునీల్, మెల్కోటే, సుధ, ‘ఢిల్లీ’ రాజేశ్వరి, కోవై సరళ, అన్నపూర్ణ ముఖ్య భూమికలు పోషించారు. లైలా ప్రత్యేక గీతంలోనూ, ప్రేమ అతిథి పాత్ర‌లోనూ మెరిసారు. మలయాళ చిత్రం ‘నిరమ్’(1999)కు రీమేక్‌గా రూపొందిన ‘నువ్వేకావాలి’కి కె. విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా… త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సంభాష‌ణ‌లు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించ‌గా… సంగీత ద‌ర్శ‌కుడు కోటి వీనుల‌విందైన బాణీలు అందించారు. “అనగనగ ఆకాశం ఉంది”, “ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే”, “కళ్ళల్లోకి కళ్ళు పెట్టి”, “అమ్మమ్మలు తాతయ్యలు”, “షుక్రియా”, “ఓలే ఓలే”… ఇలా ప్ర‌తీ పాట అప్ప‌టి యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా `ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం`గా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు… `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటి`(రిచా), ‘ఉత్తమ గాయకుడు(శ్రీరామ్ ప్రభు), ‘ఉత్తమ దర్శకుడు(విజయ భాస్కర్) విభాగాల్లో `ఫిల్మ్‌ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది. అదేవిధంగా… ఆరు కేంద్రాల‌లో 365 రోజులు ప్రదర్శితమై గోల్డెన్ జూబిలీ జరుపుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్… తెలుగు చ‌ల‌న చిత్ర చరిత్రలో ఆల్ టైమ్‌ రికార్డు సృష్టించింది. 2000 అక్టోబర్ 13న విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిల‌చిన ‘నువ్వేకావాలి’… నేటితో 19 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =