డిసెంబ‌ర్ మాసంలో 12 ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌?

2019 Movie Releases, Crazy Projects Lined up for 2019 December Release, Latest Telugu Movie News, most exciting upcoming movies of 2019, Movies 2019 December Release, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

డిసెంబర్ నెల… సంవత్సరానికి ఆఖరి నెల. అటువంటి ఈ మాసాన్ని టార్గెట్ చేస్తూ… 2019లో తెలుగునాట 12 ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌పైకి రానున్నాయని స‌మాచారం. అంతేకాదు… చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్… ఒక్కో వారాన్ని టార్గెట్ చేసుకుంటూ తెర‌పైకి రాబోతున్నాయని టాక్‌.

ఆ చిత్రాల వివ‌రాల్లో వెళితే… వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘వెంకీమామ’. డిసెంబ‌ర్ ప్ర‌థ‌మార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రానుందని ప్ర‌చారం సాగుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం, రవితేజ ‘డిస్కోరాజా’, నితిన్ ‘భీష్మ’, సాయితేజ్ ‘ప్రతిరోజూ పండగే’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ క్రిస్మ‌స్ సీజ‌న్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు స‌మాచారం. ఇక వీటితో పాటు… శర్వానంద్ ‘96’ రీమేక్, నాని ‘వి’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’, అనుష్క ‘నిశ్శబ్దం’, నాగశౌర్య ‘అశ్వత్థామ’, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీ `ఉప్పెన‌`… ఇలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా డిసెంబ‌ర్ బ‌రిలో ఉన్నట్టు టాక్. అంతేకాదు… హిందీ చిత్రం ‘దబాంగ్’ సిరీస్‌లో మూడో భాగంగా వ‌స్తున్న ‘దబాంగ్ 3’ (స‌ల్మాన్ ఖాన్‌) కూడా క్రిస్మ‌స్ సీజ‌న్‌లోనే అనువాద రూపంలో సంద‌డి చేయ‌నుంది.

మ‌రి… వీటిలో ఏ యే చిత్రాలు చివ‌రాఖ‌రికి ప్రేక్షకుల ముందుకు వస్తాయో… ఏ యే సినిమాలు విజయాలు అందుకుని సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here