మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్… నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారట. కాగా… చిరు పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో చిరు యంగ్ వెర్షన్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. అదే గనుక నిజమైతే.. మెగా అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే. త్వరలోనే చరణ్ ఎంట్రీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
2020 ఉగాది కానుకగా చిరు, కొరటాల కాంబినేషన్ మూవీ తెరపైకి రాబోతుందని ప్రచారం సాగుతోంది.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


