చారిత్రాత్మక చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’కు 33 ఏళ్ళు

Krishnam Raju Thandra Paparayudu Completes 33 Years,33 Years For Thandra Paparayudu, 33 Years For Krishnam Raju Movie Thandra Paparayudu, 33 Years of Thandra Paparayudu Movie, Latest Telugu Movie News, Thandra Paparayudu Completes 33 Years, Thandra Paparayudu Teulgu Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘తాండ్ర పాపారాయుడు’ ఒకటి. 17వ శతాబ్దంలో విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు నేపథ్యంలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. కృష్ణంరాజుకు జంటగా జయప్రద నటించగా… జయసుధ, సుమలత, మోహన్‌బాబు, రామకృష్ణ, బాలీవుడ్ నటుడు ప్రాణ్, బాలయ్య, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవి, సూర్యకాంతం, విజయలలిత, ప్రభ, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గజ స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా “అభినందన మందార మాల” అనే పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో `ఉత్త‌మ న‌టుడు`గా కృష్ణంరాజు `ఫిల్మ్ ఫేర్‌` పుర‌స్కారాన్ని అందుకోగా.. ఉత్తమ మాటల రచయిత విభాగంలో కొండవీటి వెంకటకవి `నంది` పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సోద‌రుడు యు.వి.సూర్యనారాయణరాజు ఈ భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ ఫిల్మ్‌ని నిర్మించారు. 1986 అక్టోబర్ 10న విడుదలై జ‌నాద‌ర‌ణ పొందిన ‘తాండ్రపాపారాయుడు’… నేటితో 33 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =