శ్రీ‌దేవి న‌ట విశ్వ‌రూపం ‘క్షణక్షణం’కు 28 ఏళ్ళు

28 Years For Kshana Kshanam Movie,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,28 Years For Venkatesh Movie Kshana Kshanam, Kshana Kshanam Movie Completes 28 Years,28 Years of Kshana Kshanam Movie,Kshana Kshanam Teulgu Movie

కొన్ని సినిమాలు చూడడానికే కాదు… వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా భలే సరదాగా ఉంటాయి. అటువంటి చిత్రాలలో ‘క్షణక్షణం’ ఒకటి. ‘శివ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీలో ఓ వైపు ఉత్కంఠ‌కు గురిచేస్తూనే… మరోవైపు నటీనటుల హావభావాలతో, వారి వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది “సత్య” పాత్ర. ఈ పాత్రలో నటించిన శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా… ఓ వైపు అమాయకత్వాన్ని, మరోవైపు భయాన్ని అభినయించి నటిగా తన నట విశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌లో… బాలీవుడ్ నటుడు పరేష్ రవాల్, నర్సింగ్ యాదవ్, రామిరెడ్డి, బ్రహ్మానందం, హేమ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, వెన్నెలకంటి గీత‌ర‌చ‌న‌లో… స్వరవాణి కీరవాణి అందించిన‌ బాణీలు విశేషాదరణ పొందాయి. “జాము రాతిరి జాబిలమ్మ”, “చలి చంపుతున్న చమక్కులో”, “అందనంత ఎత్తా తారా తీరం”, “అమ్మాయి ముద్దు ఇవ్వందే” వంటి పాటలతో పాటు శ్రీదేవి పాడిన “కింగ్‌లా కనిపిస్తున్నాడు” పాట కూడా బాగా పాపులర్ అయింది. ఉత్తమ నటి(శ్రీదేవి), ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైట‌ర్ (రాంగోపాల్ వర్మ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (ఎస్.గోపాల రెడ్డి)… ఇలా నాలుగు `నంది` పురస్కారాలను సొంతం చేసుకుందీ సినిమా. అంతేకాదు… ఉత్తమ నటిగా శ్రీదేవి, ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి `ఫిల్మ్ ఫేర్`(సౌత్) అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం.

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్‌.నారాయణ, వై.లక్ష్మణ చౌదరి, ఎస్‌. గోపాల రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని… హిందీలో ‘దౌడ్’(వర్మ డైరెక్షన్‌లో)పేరుతో పునర్నిర్మించడం విశేషం. 1991 అక్టోబర్ 9న విడుదలై మంచి విజయం సాధించిన ‘క్షణక్షణం’… నేటితో 28 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =