‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ అబ్రివేష‌న్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Interesting Update About RRR Movie

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే… `ఆర్ ఆర్ ఆర్‌` టైటిల్ కి సంబంధించి అబ్రివేష‌న్ స‌జెష‌న్స్‌ పంప‌మ‌ని ఇప్ప‌టికే జ‌క్క‌న్న ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కి స్పంద‌నగా వంద‌లాది అబ్రివేష‌న్ స‌జెష‌న్స్ వ‌చ్చాయ‌ట‌. అయితే, వీటిలో రెండు అబ్రివేష‌న్స్‌ని మేక‌ర్స్‌ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు వెర్షన్‌కు ‘రామ రౌద్ర రుషితం’ అనే అబ్రివేష‌న్ ను… నాన్ – తెలుగు వెర్ష‌న్స్‌కు ‘రైజ్‌ రివోల్ట్ రివెంజ్’ అనే అబ్రివేష‌న్ ను ఫిక్స్‌ చేసినట్టు టాక్‌. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ అబ్రివేష‌న్స్‌పై క్లారిటీ వ‌స్తుంది. కాగా… డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`… 2020 జూలై 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =