య‌న్‌.బి.కె 105… విడుద‌ల తేదీ ఖ‌రారు

Balakrishna New Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna upcoming Movie Release Date,Balakrishna Latest Movie Release Date Locked,Balakrishna Next Film Release Date Fixed,#Balakrishna

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో… పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య‌ కనిపించనున్నట్టు సమాచారం. సోనాల్ చౌహాన్‌, వేదిక క‌థానాయికలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా… సెప్టెంబ‌ర్ తొలి వారంలో మొద‌లైన హైద‌రాబాద్ షెడ్యూల్ ఆదివారంతో ముగిసింద‌ని… ఈ నెల 14న బిహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు 52 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ సాగ‌గా… మూడు పాట‌లు, మూడు ఫైట్ల‌తో స‌హా సింహ‌భాగం టాకీ పార్ట్ పూర్త‌య్యింద‌ని సి.క‌ళ్యాణ్ అన్నారు. అలాగే మ‌రో 45 రోజుల పాటు మిగిలిన షూటింగ్ పార్ట్ ప్లాన్ చేశామ‌ని, దీంతో సినిమా పూర్త‌వుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

కాగా.. `రూల‌ర్‌` అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు చిరంతన్ భట్ సంగీత‌మందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 1 =