హైద‌రాబాద్‌లో ‘96’ రీమేక్

96 Remake Movie Latest Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,96 Movie Updates,96 Telugu Movie Latest News,96 Remake Movie Shooting Updates,96 Remake Telugu Movie Shooting Latest News

తమిళనాట ఘన విజయం సాధించిన ’96’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్ష‌న్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే… అక్టోబర్ 10తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని కూడా స‌మాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మరి… తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ తెలుగునాట కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here