కృష్ణ‌, శోభ‌న్ బాబు మ‌ల్టీస్టార‌ర్‌ ‘మండేగుండెలు’కు 40 ఏళ్ళు

40 Years For Krishna And Sobhan Babu Mande Gundelu,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,40 Years Completed For Mande Gundelu Telugu Movie, 40 Years For Krishna Mande Gundelu Movie,Mande Gundelu movie Completes 40 Years, Mande Gundelu Telugu Movie Completes 40 Years

సూపర్ స్టార్ కృష్ణ, న‌ట భూష‌ణ్‌ శోభన్‌బాబు కాంబినేష‌న్‌లో పలు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో ‘మండేగుండెలు’ ఒక‌టి. కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జయప్రద, జయసుధ కథానాయికలుగా నటించారు. చంద్రమోహన్, మాధవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, అంజలీదేవి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రానికి గుహ‌నాథ‌న్‌ కథను అందించగా… “హాస్యబ్రహ్మ” జంధ్యాల సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాటలకు దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ బాణీలు అందించారు. “స్నానాల గదిలో”, “వీడే ధీర వీర”, “బంగారానికి సింగారానికి”, “చల్లా చల్లని చందమామ”, “ఇది ప్రేమ సామ్రాజ్యం”… వంటి గీతాలు జనాదరణ పొందాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను రంజింపచేసింది. 1979 అక్టోబర్ 5న విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేగుండెలు’… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =