మెగా ఫ్యామిలీ తండ్రీకొడుకుల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న కథానాయికలు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా… తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు కథానాయికలది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే… తెలుగునాట దాదాపు అందరు యంగ్ హీరోస్‌తోనూ ఆడిపాడి అలరించిన వైనం వీరి సొంతం. అంతేకాదు… ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకుల విషయంలో అటు తనయుడితోనూ, ఇటు తండ్రితోనూ రొమాన్స్ చేసి విజయాలను అందుకున్న నాయికలుగా కూడా ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌మ సొంతం చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరోయిన్స్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘మగధీర’, ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటించి విజయాలు సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్… ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఫిల్మ్ ‘ఖైదీ నంబర్ 150’లో చిరుకి జోడిగా నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది.

ఇక తమన్నా విషయానికి వస్తే ‘రచ్చ’వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంలో చ‌ర‌ణ్‌తో ఆడిపాడిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… తాజాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’లో చిరుకి జంటగా న‌టించి అల‌రించింది. మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మొత్తం మీద… కాజల్, తమన్నా ఇద్దరూ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకుల సరసన కథానాయికలుగా నటించడమే కాకుండా… ఘనవిజయాలను అందుకోవ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

కొసమెరుపు ఏమిటంటే… ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’… ఇలా తన తనయుడి కథానాయికలతో చిరు నటించిన ఈ రెండు సినిమాలకు కూడా రామ్ చరణ్ నే నిర్మాత కావడం మరో విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =