చాణక్య మూవీ సీక్వెల్ ?

యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రుపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ రా ఏజెంట్ , మెహరీన్ కథానాయిక , బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించిన చాణక్య మూవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా గారూపొందింది . ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

హీరో గోపీచంద్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన చాణక్య మూవీ హైదరాబాద్, రాజస్థాన్ స్టేట్ లో షూటింగ్ జరుపుకుంది. రాజస్థాన్ లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఈ మూవీ కి హైలెట్ గా నిలుస్తాయి. చాణక్య మూవీ సక్సెస్ పై చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. అంతా సక్రమంగా జరిగితే చిత్ర దర్శకుడు తిరు ఈ మూవీ సీక్వెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. తనకు ఆల్ రెడీ చాణక్య మూవీ సీక్వెల్ పై ఐడియా
ఉందని, గోపీచంద్ కూడా పాజిటివ్ గా స్పందించారని దర్శకుడు తిరు చెప్పారు. సీక్వెల్ మూవీ నిర్మాణం చాణక్య మూవీ విజయంపై కంప్లీట్ గా ఆధారపడిఉంది. స్టైలిష్ యాక్షన్ డ్రామా చాణక్య పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here