తెలుగు సినిమా నిర్మాణ ప్రమాణాలకు మరో గ్రేట్ ఎగ్జాంపుల్ సైరా

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Sye Raa Movie Public Talk, Sye Raa Movie Review, Sye Raa Movie Story, Sye Raa Narasimha Reddy Movie Public Talk, Sye Raa Narasimha Reddy Movie Review, Sye Raa Narasimha Reddy Movie Story, Sye Raa Narasimha Reddy Review, Sye Raa Narasimha Reddy Review And Ratings, Sye Raa Narasimha Reddy Telugu Movie Live Updates, Sye Raa Narasimha Reddy Telugu Movie Plus Points, Sye Raa Narasimha Reddy Telugu Movie Public Response, Sye Raa Narasimha Reddy Telugu Movie Reviews, Sye Raa Review, Sye Raa Review And Ratings, Sye Raa Telugu Movie Live Updates, Sye Raa Telugu Movie Plus Points, Sye Raa Telugu Movie Public Response, Sye Raa Telugu Movie Review, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

చరిత్ర పుటలలో గొప్పగా కీర్తించబడిన పోరాటయోధుడి కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక చారిత్రక చిత్రాన్ని నిర్మించటం గతంలో చాలాసార్లు జరిగింది. కానీ చరిత్రలో మరుగునపడిన ఒక మహా యోధుడి కథను తీసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని నిర్మించి, దానిని ‘పాన్ ఇండియన్ ఫిలిం’ గా ఆరు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటాన్ని  ఒక గొప్ప ప్రయత్నంగా
అభినందించాలి.   నిర్మాతగా మారిన జస్ట్ 35 ఏళ్ల ఒక యంగ్ స్టార్ నిర్మాణపరంగా ఇంత అద్భుతమైన ఫీట్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెరమీద కోట్ల రూపాయలు గుమ్మరిస్తే గొప్ప సినిమాలు తయారుకావు. తీసుకున్న కథాంశంలోని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ఆవిష్కరించాలి అన్న అంకిత భావం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. అలాంటి డెడికేషన్ దానికి అవసరమైన  డిటెర్మినేషన్ ‘సైరా’ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిలో, నిర్మాత రామ్ చరణ్ లో నిండుగా ఉన్నాయి కాబట్టే ఆ సినిమాలో గొప్ప మేకింగ్ అండ్ టేకింగ్ వాల్యూస్ కనిపించాయి.

మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అయినప్పటికీ చరిత్ర విస్మరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సమగ్రంగా, సమున్నతంగా ఆవిష్కరించాలన్న మెగాస్టార్ చిరంజీవి చిరకాల స్వప్నాన్ని సాకారం  చేసిన ఆయన తనయుడు రామ్ చరణ్ మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
వ్యక్తిగతంగా తమ కుటుంబానికి మాత్రమే కాకుండా ఇన్ జనరల్ గా తెలుగు చిత్ర పరిశ్రమే సగర్వంగా ఫీల్ అయ్యే స్థాయిలో  సైరా చిత్రాన్ని రూపొందించిన యువ నిర్మాత రామ్ చరణ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సైరా రివ్యూ లోకి ఎంటర్ అవుదాం.

బ్రిటిష్ పాలనలో కరువు ప్రాంతమైన కర్నూలుతో పాటూ చుట్టుపక్కల గ్రామాలన్నీ కొందరు పాళెగాండ్ల అధీనంలో ఉండేవి. దాదాపు 60 మంది పాలెగాండ్లు బ్రిటిష్ వారి అదుపాజ్ఞలలో ఉంటూ వాళ్లకు శిస్తులు చెల్లిస్తుండేవారు. కరువు కాటకాలతో పంటలు పండకపోయినా  బలవంతపు వసూళ్లు చేస్తూ రైతులను చిత్రహింసలు చేస్తుంటే ఆ దురాగతాలను ఎదిరిస్తాడు ఆ పాలేగాండ్ల లో ఒకడైన నరసింహారెడ్డి. అయితే బ్రిటిష్ శక్తులను ఎదుర్కోవటానికి ఒక్కడే కాకుండా మిగిలిన పాలెగాళ్లు కూడా తనతో కలిసి పోరాడాలని కోరినప్పుడు వాళ్లంతా భయంతో తిరస్కరిస్తారు. అయితే ఏ జనం కోసం తను బ్రిటిష్ వాళ్లకు ఎదురు నిలిచాడో ఆ జనమే అండగా తరలి రావటంతో గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఒక తెల్లదొర తల నరికి వాళ్లకే కానుకగా పంపిస్తాడు. ఆ వీరోచితమైన తిరుగుబాటును చూసి మిగిలిన పాలెగాళ్లు కూడా స్ఫూర్తి పొంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో చేతులు కలపటంతో  ఉద్యమం ఉదృతం అవుతుంది.
ఆ ఉద్యమాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచి వేయడం కోసం  బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటి?

వాటిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  సమర్థవంతంగా తిప్పికొట్టిన తీరేమిటి?

ఆ పోరాటంలో నర్సింహా రెడ్డి తో చేతులు కలిపిన పాలెగాళ్లలో  ఎవరెవరు ఎలాంటి  బాధ్యతలు నిర్వహించారు?

ఊహ తెలియని వయసులోనే బాల్య వివాహం జరిగిన నరసింహారెడ్డి పోరాటం కోసం చేసిన త్యాగం ఏమిటి?

నరసింహారెడ్డి మనసు పడింది  ఎవరిమీద? కాని తాళి కట్టింది  ఎవరికి? భార్య సిద్ధమ్మ తో పాటు , ఆయన మనసిచ్చిన లక్ష్మి ఉద్యమం కోసం చేసిన త్యాగాలు ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది సైరా చిత్ర కథ.

పర్ఫార్మెన్సెస్:

ఈ కథ మొత్తం లో సర్వాంతర్యామిగా కనిపించేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితే ఈ సినిమా మొత్తం మీద వన్ మేన్ షో గా కనిపించేది మెగాస్టార్ చిరంజీవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత గాథను అభినయించాలి అన్న  కోరిక తనలో ఎంత బలీయంగా ఉందో చెప్పటానికి నిదర్శనంగా ఉంది ఇందులో మెగాస్టార్ చిరంజీవి పర్ఫార్మెన్స్. ఈ సినిమా చేయడం కోసం తన పదిహేనేళ్ల నిరీక్షణ తాలూకు కసి, కృషి, పట్టుదల, తపన ఆయన అభినయ, ఆంగిక, ఆహార్యాలలో కనిపించింది. నాలుగు పదుల తన సుదీర్ఘ నట జీవితంలో 150 సినిమాలలో విభిన్న పాత్రలు పోషించిన చిరంజీవి అభినయ సామర్థ్యానికి సవాలు విసిరిన పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ పాత్ర లో ఉన్న  వీర రౌద్ర శాంత కరుణాది రసాలను చాలా సమతుల్యంగా పోషించి ఒక నటుడిగా తన అనుభవ, సామర్ధ్యాలను గొప్పగా ఆవిష్కరించుకున్నారు చిరంజీవి. చరిత్ర పుటలలో మరుగున పడిపోయిన ఒక unsung warrior వీరోచిత గాధను అందరూ చెప్పుకునే పాఠ్యాంశంగా మలచిన ప్రయత్నానికి మూలస్తంభంగా నిలిచిన చిరంజీవి నట జీవితం ఈ పాత్ర పోషణతో మరింత ప్రతిష్టను సంతరించుకుంది అని చెప్పవచ్చు.

ఇక చిన్నా పెద్దా తేడా లేకుండా మిగిలిన నటీనటులు అందరూ పాత్రోచితమైన నటనతో మెప్పించారు. ఎవరెవరిని ఏఏ పాత్రల కోసం ఏ లక్ష్యంతో ఎన్నుకున్నారో అందుకు సరితూగే పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరూ వెల్ డన్ అనిపించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో  నటించిన ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబచ్చన్  అప్పియరెన్స్ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్థాయి పెంచుకున్న సురేందర్ రెడ్డి:

కేవలం 8 చిత్రాల అనుభవం ఉన్న యువ దర్శకుడు సురేందర్ రెడ్డికి సైరా దర్శకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సబ్జెక్ట్ వైజ్, బడ్జెట్ వైజ్, ప్రెస్టేజ్ వైజ్,స్పాన్ వైజ్ ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న ఈ సినిమాను అంత చిన్న కుర్రాడు హ్యాండిల్ చేయగలడా అని ఆశ్చర్యపోయిన వాళ్లకు తన అద్భుతమైన టేకింగ్ తో తిరుగులేని సమాధానం చెప్పాడు సురేందర్ రెడ్డి.
సినిమా అనేది దర్శకుడి మనోనేత్రం లో ఆవిష్కృతమైన తరువాతే తెరమీదకు ఎక్కుతుంది. ఆ మనోనేత్ర దర్శనంలో దర్శకుడి విజువలైజేషన్ ఎంత గొప్పగా ఉంటే సినిమా అంత గొప్పగా వస్తుంది అనటానికి సైరా లోని ప్రతి ఫ్రేమ్ ను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఏ సన్నివేశాన్ని గాని, షాట్ ను గానీ సురేందర్ రెడ్డి  take it easy గా తీసుకున్నట్లు అనిపించదు.

అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక మొదలు మ్యూజిక్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, మేకప్, ఫైట్స్ వంటి అన్ని  శాఖల నుండి తనకు కావలసిన, రావలసిన ఔట్ పుట్ ను  సమర్థవంతంగా తీసుకోగలిగాడు సురేందర్ రెడ్డి. అంతేకాకుండా ఆలిండియా సూపర్ స్టార్ అమితాబచ్చన్, సౌత్ ఇండియా మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, సాండిల్ వుడ్ వంటి  అన్ని చిత్ర రంగాల నుండి మేటి నటీనటులను ఎంపిక చేసుకుని సినిమాకు పాన్ ఇండియన్ లుక్ తేవటంలో సఫలీకృతుడయ్యాడు సురేంద్ర రెడ్డి. మరొక అభినందనీయమైన విషయం ఏమిటంటే నిర్మాత పెట్టిన ఖర్చు తెరమీద అందంగా, అర్థవంతంగా కనిపించినప్పుడే ఇలాంటి భారీ చిత్రాలు తీయడానికి నిర్మాతలు వెనుకాడని భరోసా ఇచ్చాడు సురేందర్ రెడ్డి.

హ్యాట్స్ ఆఫ్ టూ  రామ్ చరణ్:

సాధారణంగా కొడుకు కలలను తండ్రి నెరవేరుస్తాడు. అయితే  తండ్రి కలను నెరవేర్చే కొడుకులు చాలా అరుదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న చిరంజీవి చిరకాల వాంఛను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చి worthy son అనిపించుకున్నాడు రామ్ చరణ్.

ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ ప్రదర్శించిన నిర్మాణ సామర్థ్యం, అభిరుచి, దక్షత అద్భుతం అనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమా నిర్మాణం అంటే విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం కాదు… ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరమీద కనిపించాలి అనేలా ప్రొడక్షన్ డిజైన్ చేసుకోవటమే నిజమైన మేకింగ్. అది కేవలం మాటలతో సాధ్యపడేది కాదు. కథ తాలూకు డిమాండ్స్ పట్ల, రిక్వైర్మెంట్స్ పట్ల సమగ్రమైన అవగాహన కావాలి. చిన్న వయసులోనే అలాంటి అవగాహనను ఏర్పరచుకుని ఇంత పెద్ద మల్టీ మిలియన్ ప్రాజెక్టును ఇంత  సమర్థవంతంగా హ్యాండిల్ చేసి ప్రతి తెలుగు వాడు గర్వపడే స్థాయిలో ఒక పాన్ ఇండియన్ సినిమాను నిర్మించిన రామ్ చరణ్ కు హాట్సాఫ్.

ఇలాంటి మహత్తర, బృహత్తరమైన ప్రాజెక్ట్స్ లో ఒకటీ అరా లోపాలు కనిపించినప్పటికీ వాటిని రంధ్రాన్వేషణ దృష్టితో కాకుండా పాజిటివ్ కోణంలో చూసి అభినందించాలే కానీ ఇలాంటి అరుదైన ప్రయత్నాలను రేటింగుల రేసులోకి లాగటం సమంజసం కాదు.
Sye Raa is Truly a Proud film that deserves an Unconditional Appreciation.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here