రామ చక్కని సీత మూవీ రివ్యూ

Latest Telugu Movies News, Rayalaseema Love Story Movie Plus Points, Rayalaseema Love Story Movie Public Talk, Rayalaseema Love Story Movie Rating, Rayalaseema Love Story Movie Review, Rayalaseema Love Story Movie Story, Rayalaseema Love Story Review, Rayalaseema Love Story Telugu Movie Live Updates, Rayalaseema Love Story Telugu Movie Public Response, Rayalaseema Love Story Telugu Movie Review, Rayalaseema Love Story Telugu Movie Review And Rating, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఇంద్ర‌, సుకృత జంట‌గా శ్రీ హర్ష మందా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ చ‌క్క‌ని సీత’‌. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందో..? లేదో..?తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : ఇంద్ర, సుకృత వాగ్లే, ప్రియదర్శి, కాశీ విశ్వనాథ్, అభయ్, బుల్లెట్ భాస్కర్, అప్పారావ్, మధుమణి, మాధవి, శ్రీలత, రాహుల్ సిప్లిగంజ్, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, నవీన్ పటమటలంక, ఫణి బసంత్ మరియు కృష్ణ మోహన్
దర్శకత్వం : శ్రీహర్ష మంద
నిర్మాత‌లు : జి ఎల్ ఫణికాంత్ ,శ్రీమతి విశాల లక్ష్మీ
సంగీతం : కేశవ్ కిరణ్
సినిమాటోగ్రఫర్ : సన్నీ

కథ:

బాలు(ఇంద్ర) లైఫ్ ను సీరియస్ గా తీసుకోకుండా తనకు నచ్చినట్టు ఉంటూ.. తనకు నచ్చింది చేసుకుంటూ ఉండే హ్యాపీ గోయింగ్ కుర్రాడు. అలాంటి బాలు తన తొలి చూపులోనే అను (సుకృత వాగ్లే) తో ప్రేమలో పడతాడు. అయితే తనను ప్రేమలో పడెయ్యడానికి బాలు పలు ప్లాన్ లు వేస్తూ ఉంటాడు. అలా ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం సిద్దు అనే వ్యక్తికా ఫోన్ లో పరిచయమవుతాడు. అయితే సిద్దు పేరుతో తనను మోసం చేసింది బాలు అని విషయం తెలుసుకున్న అను అతనిని దూరం పెడుతుంది. ఆలా విడిపోయిన వారు మళ్ళీ ఎలా కలిశారు..? సిద్దు అను మనసును ఎలా గెలుచుకున్నాడు..? అను బాలు చేసిన తప్పును క్షమించిందా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే

విశ్లేషణ:

నిజానికి ఇప్పటివరకూ మనం ఎన్నో ప్రేమకథలు చూసుంటాం. ఎన్ని ప్రేమకథలు వచ్చినా ఏదయినా కొత్తగా ఉంటే ఇంకా ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా చూస్తారు ప్రేక్షకులు. అలాంటి కొత్త కథతో తెరకెక్కిన సినిమానే ‘రామ చక్కని సీత’.

ఇక ఈ సినిమాలో నటించిన ఇంద్ర తన మొదటి సినిమా అయినా కూడా చాలా చక్కగా నటించాడు. బాలు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆడుతూ పాడుతూ తిరిగే అబ్బాయి లాగా.. అమ్మాయిని ప్రేమలో దించడానికి చేసే ప్రయత్నాల్లో.. ఇంకా ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు. తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. మంచి సినిమాలు పడితే మంచి హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ కూడా చేసిన సుకృత కూడా మంచి అభినయంతో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాకు మరో హైలైట్ కమెడియన్ గా ప్రియదర్శి. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

అలాగే డైరెక్టర్ మంచి పాయింట్ ను తీసుకున్నాడని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్ని.. అలాగే కామెడీని చాలా బాగా చూపించాడు. ప్రేమ, స్నేహం వంటి విషయాలలో నేటి తరం యువత తీసుకొనే అనాలోచిత నిర్ణయాల గురించి చక్కగా చూపించాడు. దర్శకుడిగా శ్రీ హర్ష ఈ ప్రేమ కథను తనదైన శైలిలో చెప్పడంలో విజయవంతమయ్యాడు.

సినిమాకు సినిమాటోగ్రఫీ మరో హైలైట్. వైజాగ్ ఎపిసోడ్ ను తెరపై అందంగా చూపించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్రధాన బలం. చిన్న సినిమా అయినా కూడా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరూ చూడదగిన సినిమా అని చెప్పొచ్చు. ఈ వారాం చూడటానికి రామ చక్కని సీత ది బెస్ట్ ఛాయస్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =