మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ప్లాన్ చేస్తున్న బన్నీ ?

Stylish Star Allu Arjun Planning For 2 Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Arjun Upcoming Movie News,Allu Arjun Next Film Updates,Allu Arjun Next Project Details,Allu Arjun Latest Film Updates

‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అలా వైకుంఠ‌పుర‌ములో’లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనంతరం… టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రాలు చేయ‌నున్నాడు బ‌న్నీ. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. కాగా… ఒకవైపు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూనే… మరోవైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో… పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే… తెలుగు, తమిళ భాషల్లో చేయనున్న బైలింగ్వల్ మూవీ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. అయితే… అట్లీ ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘బిగిల్’ సినిమాతో బిజీగా ఉన్న కార‌ణంగా… వచ్చే ఏడాది బన్నీతో సినిమా చేసే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బన్నీ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని కథనాలు వినిపిస్తున్నాయి.

కాగా… త్వరలోనే ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =