అఖిల్ సినిమాలో జాయిన్ అయిన పూజ..!

Pooja Hegde Joins Akhil Akkineni New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Pooja Hegde joins Akhil Akkineni fourth film,Pooja Hegde Joins The Shoot Of #Akhil4,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie News,Pooja HegdeNext FIlm Updates,Pooja Hegde New Movie News

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తొలిరోజు సెట్ లో ఆమె ఎలా గడిపారో వీడియో ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పూజ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అలవైకుంఠపురంలో’ మూవీలో కూడా ప్రధాన నాయకిగా పూజా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు ప్రభాస్ తదుపరి చిత్రం జాన్ లో కూడా పూజా నటిస్తుంది.

మరి అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. మరి ఎప్పటినుండో మంచి హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్ కోరిక ఈ సినిమాతో అయినా తీరుతుందో..? లేదో..? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =