సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా ! మూవీ

#EnthaManchivaadavuraa, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Telugu Movie Latest News, Entha Manchivaadavuraa Telugu Movie Releasing For Sankranthi, Kalyan Ram Is Coming With Entha Manchivaadavuraa, Kalyan Ram Stages A Comeback With Entha Manchivaadavuraa, Latest Telugu Movies News, Nandamuri Kalyan Ram Entha Manchivaadavuraa Movie Release Date, Nandamuri Kalyan Ram Entha Manchivaadavuraa To Release For Sankranthi, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ్రీ దేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఎంత మంచివాడవురా ! మూవీ సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంక్రాంతి పండుగ మూవీ రిలీజ్ లకు పెద్ద సీజన్ అని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా పండుగ రోజులలో మూవీస్ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తారు. 2020 సంవత్సరంలో ప్రజలు సంక్రాంతి పండుగతో పాటు సినిమా పండుగ కూడా జరుపుకొంటారు. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు- సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్- అల.. వైకుంఠపురములో .. , సూపర్ స్టార్ రజనీకాంత్- దర్బార్ , యంగ్ హీరో శర్వానంద్ – శ్రీకారం, KS రవికుమార్-బాలకృష్ణ మూవీ లతో పాటు కళ్యాణ్ రామ్ – ఎంత మంచివాడవురా ! మూవీ రిలీజ్ కానుంది. ఎంత మంచివాడవురా ! మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, రిలీజ్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here