మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్యకి జంటగా మెహ్రీన్ నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, సత్య, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో తను మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: