మ‌రోసారి అదితి రావ్ హైద‌రీ సంద‌డి

Actress Aditi Rao Hydari Latest News, Aditi Rao Hydari Back To Mollywood After 14 Years, Aditi Rao Hydari New Movie News, Aditi Rao Hydari Next Film Updates, Aditi Rao Hydari Next Project Details, Aditi Rao Hydari Upcoming Film Updates, Heroine Aditi Rao Hydari Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

`సమ్మోహ‌నం` చిత్రంతో గ‌త ఏడాది తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోన‌ప‌రిచింది అందాల తార అదితి రావ్ హైద‌రీ. ఆ త‌రువాత `అంత‌రిక్షం`లో త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న `వి`లో న‌టిస్తోంది. నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అదితి యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం అదితి `వి`తో పాటు `సైకో`, `తుగ్ల‌క్ ద‌ర్బార్‌` అనే త‌మిళ చిత్రాలు, `సుఫీయుమ్ సుజాత‌యుమ్‌` అనే మల‌యాళ పిక్చ‌ర్ చేస్తోంది. ఒక‌వైపు తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేస్తున్న అదితి… ఇప్పుడు మ‌ల‌యాళంలో న‌టించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే… త‌ను నాయిక‌గా న‌టించిన తొలి చిత్రం `ప్ర‌జాప‌తి`(2006) (మ‌మ్ముట్టి క‌థానాయ‌కుడు) త‌రువాత‌ మ‌ళ్ళీ అదితి మ‌ల‌యాళంలో సినిమా చేయ‌నేలేదు. మ‌రి… 14 ఏళ్ళ త‌రువాత అదితి నుంచి రాబోతున్న ఈ మ‌ల‌యాళ చిత్రం ఆమె కెరీర్‌కు ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =