సహజ నటి జయసుధకు ‘అభినయ మయూరి’ అవార్డ్

Versatile Actress Jayasudha Gets Abhinaya Mayuri Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jayasudha entitled abhinaya Mayuri,Jayasudha honoured with Abhinaya Mayuri,Jayasudha Latest News,Actress Jayasudha News

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంధర్భంగా కళాబంధు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ…ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాను అంటే.. ఈ కార్యక్రమాలు టీవీల ద్వారా చూసి అందరూ ఆనందిస్తారని ప్రేక్షకుల ఆనందం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజు నాడు ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పుట్టినరోజు ఓ పవిత్రమైన రోజు.. అటువంటి రోజు మనం మన జీవితంలో ఏం సాధించాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం.. అనే విషయాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. విశాఖను దత్తత తీసుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్నీ దేవాలయాల అర్చకులను పిలిపించి ఆశీర్వదించడం.. వాళ్ల చేత ఈ ప్రదేశాన్ని పుణీతం చేయించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. కళను అభినందిస్తాను.. కళను ప్రేమిస్తాను.. కళను ఆరాధిస్తాను.. కళకు గౌరవిస్తాను అందుకే కళాకారులకు సత్కారం చేస్తున్నాను అని అన్నారు. శివాజీ గణేషన్, అక్కినేని నాగేశ్వరారావు.. ఇలా ఎందరో నటీనటులను సత్కరించినట్లుగా దాదాపు 46ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో జీవించి, పాత్రల్లో లీనం అయిపోయిన జయసుధకు అభినయ మయూరి అవార్డును ఇస్తూ సత్కరిస్తున్నట్లు చెప్పారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ..కృష్ణదేవరాయులు సుబ్బరామి రెడ్డి రూపంలో మళ్లీ పుట్టాడా? అనిపిస్తుంది. ఎంతోమంది కళాకారులను, రాజకీయనాయకులను ఒకే వేదికపైకి తీసుకుని రావడం చిన్న విషయం కాదని, అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డిని అభినందించాల్సిందే అని అన్నారు. శ్రీమతి జయసుధ గారికి సత్కారం చేస్తూ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు జయసుధ గారి ముఖ కవళికలను గమనించేవారని మనం భారీ డైలాగులు చెప్పినా కూడా జయసుధ ఒక్క ఎక్స్ ప్రెషన్ తో డామినేట్ చేస్తుందని అనేవారని చెప్పుకొచ్చారు.

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ..మనిషిగా పుట్టడం చాలా గొప్ప విషయం.. మనిషిగా బ్రతకడం ఇంకా చాలా గొప్ప విషయం.. అలా బతకుతున్న వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారు అని, మనలో ఉన్న మైనస్ పాయింట్లను వదిలేసి ప్లస్ పాయింట్లను చేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆ విషయాన్ని సుబ్బరామిరెడ్డి అన్న దగ్గర నేర్చుకున్న అని అన్నారు. ఇటువంటి కలయిక చేయడం ఆయనకే సాధ్యం అయ్యిందని రాజశేఖర్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ పోస్ట్ చాలా గొప్పది ఆయన ఈ కార్యక్రమంకి వచ్చారంటే దీనికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అన్నారు. అలాగే మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కి సుబ్బరామి రెడ్డి గారు సహకరించాలని రాజశేఖర్ కోరారు. అలాగే జయసుధ గారు చాలా గొప్ప నటి. ఆమెను సన్మానం చేయడానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సుబ్బరామి రెడ్డి గారి ప్రేమ, మంచితనం వల్లే అందరూ ఇక్కడికి వచ్చారని రాజశేఖర్ అన్నారు.

నటి ఉర్వశి శారద మాట్లాడుతూ.. టీఎస్సార్‌ చాలా మందికి సహాయం చేస్తారని కాని ఆవిషయం ఎప్పుడు చెప్పుకోని గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ అన్ని రంగాల్లో విజయం సాధించిన వ్యక్తి టీఎస్సార్‌ అన్నారు. వైజాగ్‌ అంటే మొదట బీచ్‌ ఆ తరువాత టీఎస్సార్‌ గుర్తుకు వస్తారన్నారు.

రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. టీఎస్సార్‌ జన్మదిన వేడుకలు తెలుగు పండుగతో సమానమన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన జన్మదినం కోసం విశాఖకు వస్తారన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ..సుబ్బరామిరెడ్డి గారి ప్రతీ పుట్టినరోజు వేడుకలకు మేము వస్తామని, ఒక మనిషికి ఒక్క కోణంలో కాకుండా ఎన్నో కోణాల్లో ఉండే మనిషిని చూడాలంటే సుబ్బరామిరెడ్డి గారిని చూస్తే సరిపోతుందని అన్నారు. ఆయనకు ఈ విశాఖ పట్నానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు, 14సంవత్సరాల నుంచి పుట్టిన రోజు వేడుకలకు ఆయన మా మీద చూపించే ప్రేమ వల్లే వస్తున్నామని అన్నారు. శివనామస్మరణ చేయకుండా ఆయన ఉండలేరని, నటరాజ స్వరూపం ప్రతీవారిలో చూసే వ్యక్తి టీఎస్ఆర్ గారని అన్నారు. కళాకారుడికి పూజ చేసుకుని మంచి చేసే వ్యక్తి ఆయన అన్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడిన, ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడుతూ.. అందరికీ కావలసినవి చేస్తారని చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే మాములు విషయం కాదు. అన్ని మతాల వారిని తీసుకుని వచ్చారని అన్నారు. సమాజంలో ఉండే అతి తక్కువ వ్యక్తుల్లో రత్నం లాంటి వ్యక్తి సుబ్బరామి రెడ్డి అని అన్నారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, సుబ్బరామి రెడ్డి లాంటి వారికి మరణం లేదన్నారు. ప్రతీ సంవత్సరం ఉగాది, శ్రీరామ నవమి లాగా సుబ్బిరామి రెడ్డి పుట్టినరోజు ప్రతీ సంవత్సరం చేసుకునేందుకు వస్తామని అన్నారు. భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడు సుబ్బరామిరెడ్డి అని బ్రహ్మానందం అన్నారు. అలాగే జయసుధకు అభినయ మయూరి బిరుదు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. ఇటువంటి పేరును పెట్టడం మామూలు విషయం కాదని అన్నారు.

సినీ పరిశ్రమకు వైజాగ్‌ ఓ వరమన్నారు. జయసుధతో కలిసి అనేక సినిమాల్లో నటించానని, ఆమె అద్భుత నటి అని కొనియాడారు. నటుడు శరత్‌ కుమార్‌ తన మాటలతో నవ్వులు పూయించారు. టీఎస్సార్‌ ఈ వయస్సులో కూడా తన వాయిస్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నారన్నారు. 46 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జయసుధ రాణించడం అభినందనీయమన్నారు. సెప్టెంబర్‌ 17న సినీ పరిశ్రమలో ప్రముఖులు అంత ఎక్కడ ఉంటారు అంటే విశాఖలోనే అని గత కొన్నేళ్లుగా రుజువు అవుతుందన్నారు.

చివరిగా సన్మాన గ్రహీత సహజ నటి, అభినయ మయూరి జయసుధ మాట్లాడుతూ..’ ప్రతీ సంవత్సరం సుబ్బిరామిరెడ్డి గారు పుట్టినరోజుకు వస్తుంటాం.. కానీ, ఈ సంవత్సరం నన్ను ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వారి మీద ఎంతో గౌరవంతో ఇక్కడికి అనేకమంది వచ్చారని అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. టీఎస్సార్‌ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు. అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు.తన గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాధిక, జయప్రద, శరత్ కుమార్, మురళీ మోహన్, ఇలా వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయనిర్మల గారిని మాత్రం ఎంతో మిస్ అవుతున్నానని అన్నారు. పండింటి కాపురం.. జమున గారితో నటించానని, ఆమె ముందు అవార్డు అందుకోవడం నా అదృష్టం అని అన్నారు. అందరి ఆశీస్సులు ఉండాలని సహజనటిగా బిరుదు ఇచ్చిన మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు జయసుధ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 7 =