సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ‘సాహో’ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను తెచుకున్న సంగతి తెలిసిందే. అయితే టాక్ కు కలెక్షన్స్ కు ఏమాత్రం సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.. రాబడుతూనే ఉంది. అంచనాలను అందుకోలేకపోయినా వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూదూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగులో కంటే కూడా హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతూ ఒక రేంజ్ లో దూసుకెళుతోంది. హిందీలో ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఎందుకంటే 153 కోట్లు సాధించినట్టు ఆఫీషియల్ గా ప్రకటించారు చిత్రయూనిట్. బాలీవుడ్ లో ఒకరిద్దరి హీరోల సినిమాకు తప్పితే ఇంత రేంజ్ లో కలెక్షన్స్ ను రావడం కష్టమే. కానీ అలాంటి మ్యాజిక్ ప్రభాస్ విషయంలో జరగడం ఆశ్చర్యపరుస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకూ 430 కోట్లు రాబట్టిన ‘సాహో’ 500 కోట్లు రాబట్టే దిశగా ప్రయాణం చేస్తుంది. మరి చూద్దాం ఆ మార్క్ ను ఎప్పుడు దాటుతుందో…!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: