ఇక్క‌డ ‘వాల్మీకి’… అక్క‌డ ‘ప్రస్థానం’…

Remake Films Valmiki and Prassthanam to Release On Same Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Varun Tej Valmiki Movie Releasing On 20th September 2019,Valmiki Movie Story,Valmiki Telugu Movie Live Updates

2019 సెప్టెంబ‌ర్ 20… ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన‌ తెలుగు ద‌ర్శ‌కుల‌కు ప‌రీక్షా కాలం కానుంది. ఎందుకంటే… అదే రోజున ఆ యా నిర్దేశ‌కులు వేర్వేరు భాష‌ల్లో రీమేక్ చిత్రాల‌తో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఆ ద‌ర్శ‌కులు మ‌రెవ‌రో కాదు… హ‌రీష్ శంక‌ర్‌, దేవ క‌ట్టా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివ‌రాల్లోకి వెళితే… `గ‌బ్బ‌ర్‌సింగ్‌` (2012) వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన రీమేక్ మూవీ `వాల్మీకి`. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ మాఫియా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌… తమిళ చిత్రం ‘జిగర్తండా’(2014)కి రీమేక్‌గా తెర‌కెక్కింది. ఈ నెల 20న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్లలోకి రానుంది.

ఇక ఇదే రోజున మరో టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా దర్శకత్వం వహించిన హిందీ మూవీ ‘ప్రస్థానం’ కూడా రిలీజ్‌ కానుంది. దేవ కెరీర్‌లోనే బెస్ట్ పిక్చ‌ర్‌గా నిల‌చిన‌ తెలుగు చిత్రం ‘ప్రస్థానం’(2010)కి రీమేక్‌గా రూపొందిన ఈ పొలిటిక‌ల్ డ్రామాలో ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ప్రధాన పాత్ర పోషించాడు. త‌న సినిమాని త‌నే రీమేక్ చేసుకోవ‌డం… ఒరిజిన‌ల్ కంటే మెరుగ్గా రీమేక్ అవుట్‌పుట్ రావ‌డంతో దేవ కూడా ఫ‌లితంపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

మ‌రి… ఒకే రోజు థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ విభిన్న‌ చిత్రాలు… ఆ యా టాలెంటెడ్ డైరెక్టర్స్ కెరీర్‌కు ఏ మేర‌కు ప్ల‌స్‌ అవుతాయో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =