బ‌ల్గేరియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’

Jr NTR Wrapped Up RRR Movie Bulgaria Schedule, Latest Telugu Movies News, RRR Movie Bulgaria Schedule Wrapped Up, RRR Movie Shooting Updates, RRR Movie Updates, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Shooting Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు… వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా… కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి తెరరూపం ఇస్తున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో… కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్‌లో… బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌… తాజాగా బల్గేరియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా తారక్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు… ఇంట్ర‌డక్ష‌న్ సీన్‌ను కూడా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా… త్వరలో హైదరాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్న త‌దుప‌రి షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్ కూడా పాల్గొంటార‌ని స‌మాచారం.

కాగా… దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 1 =