క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్.. తాజాగా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేసారు. రేపు ఉదయం 11గంటలకు విజయ్ దేవరకొండ చిత్ర టైటిల్ ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా నటిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.
దీనితో పాటు ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్… ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే… 2020 సమ్మర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
మరి డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త నిరాశపరచిన విజయ్.. ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: