‘శకుంతల దేవి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Vidya Balan Shakuntala Devi First Look Out Now,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Shakuntala Devi First Look,Shakuntala Devi First Look Poster,Vidya Balan Shakuntala Devi Movie,Shakuntala Devi Movie Latest News,Vidya Balan New Movie Shakuntala Devi

మొదటి నుండి విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన విద్యా.. మరో బయోపిక్ తో రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో ఇప్పటికే ఈఏడాది నట సార్వభౌమ నందమూరి తారకరామ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలలో బసవతారకం పాత్రలో చక్కగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆమె నటనకు మాత్రం మంచి ప్రశంసలు అందాయి.

ఇప్పుడు గణితశాస్త్ర మేథావి.. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ‘శకుంతల దేవి’ బయోపిక్ లో విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్ ను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా అను మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మాణంలో విక్రమ్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ బయోపిక్ తో విద్యా బాలన్ ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =