ఆసక్తికర క్యారెక్టర్స్, విభిన్న కథాంశ చిత్రాలను ఎంపిక చేసుకొనే రానా దగ్గుబాటి ఒక హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు తెలుగు, హిందీ మూవీస్ లో నటిస్తున్న రానా ప్రస్తుతం USA లో ఉన్నారు. ఈ నెలాఖరుకు హైదరాబాద్ చేరుకొని వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. కంటిన్యూ షెడ్యూల్స్ తో విరాటపర్వం మూవీ షూటింగ్ పార్ట్ రానా కంప్లీట్ చేస్తారని సమాచారం.
సూపర్ హిట్ హారర్ మూవీ గృహం దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా హీరోగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో ఒక హారర్ మూవీ రూపొందనుంది. ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. దర్శకుడు మిలింద్ ఒక సంవత్సరం పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేయడం విశేషం. ఈ మూవీ ని ఆచంట గోపినాథ్ నిర్మిస్తున్నారు. తారాగణం, టెక్నీషియన్స్ ఎంపిక లో దర్శకుడు మిలింద్ బిజీగా ఉన్నారు.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.