డిస్కో రాజా కోసం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ టీమ్

Fast And Furious 7 Team For Disco Raja Movie,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Fast & Furious 7 stunt team for Ravi Teja Disco Raja,Disco Raja Movie,Ravi Teja New Movie Disco Raja,Disco Raja Movie Action Composes,Disco Raja Telugu Movie Updates

ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగు పూర్తిచేసుకుంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ కి పనిచేసిన స్టంట్ మాస్టర్లు పనిచేయనున్నారట. అంతే కాదు ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ తో పాటు నాభా నటేష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇంకా సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా రవితేజాకు మంచి సక్సెస్ వస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =