మ‌్యూజిక‌ల్ సెన్సేష‌న్ ‘లేత మనసులు’కు 53 ఏళ్ళు

53 Years For Musical Hit Letha Manasulu Movie,53 Years For Letha Manasulu,40 Years For Letha Manasulu Movie, 53 Years For Blockbuster Letha Manasulu Movie, Letha Manasulu Movie Completed 53 Years, Letha Manasulu Telugu Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Letha Manasulu Movie

మనస్పర్ధలతో విడిపోయిన తల్లిదండ్రులను కలిపిన ఇద్దరు చిన్నారుల కథే ‘లేత మనసులు’ చిత్రం. లల్లీ(ల‌లిత‌), పప్పీ(ప‌ద్మిని)గా ద్విపాత్రాభినయం చేసిన కుట్టి పద్మిని న‌ట‌నే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా తెర‌కెక్కిన ఈ సినిమాని కృష్ణన్, పంజు సంయుక్తంగా తెర‌కెక్కించారు. హరనాథ్, జమున, రేలంగి, జి.వరలక్ష్మి, పద్మనాభం, గీతాంజలి ముఖ్య భూమికలు పోషించగా… రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్రలో మెరిసారు. 1949లో ఎరిచ్ కాస్ట్న‌ర్‌ రచించిన జ‌ర్మ‌న్ న‌వ‌ల ‘లొట్టి అండ్ లిసా’ ఆధారంగా ‘ట్వైస్ అపాన్ ఎ టైమ్(1953), ‘ద పేరెంట్ ట్రాప్’(1961) వంటి బ్రిటిష్ చిత్రాలు తెరకెక్కగా… వాటి స్పూర్తితో తమిళంలో ‘కుళందైయుమ్‌ దైవముమ్” చిత్రాన్ని రూపొందించారు కృష్ణ‌న్‌, పంజు. త‌మిళ‌నాట అఖండ ప్ర‌జాదర‌ణ పొందిన ఆ త‌మిళ సినిమానే ‘లేత మనసులు’గా తెలుగులో పునర్నిర్మించారు స‌ద‌రు ద‌ర్శ‌క‌ద్వ‌యం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా పరంగానే కాకుండా సంగీత పరంగానూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి దాశరధి, ఆరుద్ర గీత రచన చేయగా… లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎస్.విశ్వనాథన్ `బాణి`ముత్యాలు అందించారు. “అందాల ఓ చిలకా”, “కోడి ఒక కోనలో”, “పిల్లలు దేవుడు చల్లనివారే”, “హలో మేడమ్‌ సత్యభామ”, “అందాల ఈ రేయి” … ఇలా ప్ర‌తీ గీతం విశేషాదరణ పొందింది. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.వి.మేయప్పన్ నిర్మించిన ఈ చిత్రం… అప్పట్లో సంచలన విజయం సాధించింది. 1966 సెప్టెంబర్ 16న విడుదలైన ‘లేత మనసులు’… నేటితో 53 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

ఈ మూవీ చూడాలంటే అమెజాన్ లో ఉంది. క్లిక్ చేయండి ఎంజాయ్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =