బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో సుకుమార్ సందడి

Sukumar Surprises Telugu Audience,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Director Sukumar Surprises Telugu Audience,Sukumar Next Movie Updates,Director Sukumar Latest News,Sukumar Next Upcoming Movie Details

ఇన్నోవేటివ్ థాట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిల‌చిన ఈ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ఈ బ్రిలియంట్ డైరెక్ట‌ర్ తెరకెక్కించిన ప్ర‌తీ సినిమా యూత్‌ని మెస్మ‌రైజ్ చేసింది. ఇదిలా ఉంటే… ఇంతకాలం తెర వెనకే ఉండి ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్రిలియంట్ డైరెక్టర్… ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నాడు. విశేషమేమిటంటే… బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో సందడి చేస్తున్న ఈ రెండు చిత్రాల్లోనూ సుక్కు ద‌ర్శ‌కుడిగానే కనిపించ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’లో అతిథిగా మెరిసాడు సుకుమార్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో… సుక్కు ద‌ర్శ‌కుడిగానే క‌నిపించాడు. అంతేకాదు… నాని, సుక్కు మధ్య వ‌చ్చే ఈ క్లైమాక్స్ సీన్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కట్ చేస్తే… ఈ వారం (సెప్టెంబర్ 20) రిలీజ్ కానున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇందులో షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్‌కి అవార్డ్స్ అంద‌జేసే సన్నివేశంలో ఫిల్మ్ డైరెక్ట‌ర్‌గా (జ‌డ్జ్‌గా) కనిపించనున్నాడ‌ట సుక్కు.

మ‌రి… ‘గ్యాంగ్ లీడర్’లో సుక్కు సీన్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో… ‘వాల్మీకి’ లోనూ అది రిపీట్ అవుతుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =