చిరంజీవి ‘కోతల రాయుడు’కి 40 ఏళ్ళు

40 Years For Chiranjeevi Kothala Rayudu,40 Years For Kothala Rayudu Movie, 40 Years For Chiranjeevi Blockbuster Kothala Rayudu Movie, Kothala Rayudu Movie Completed 40 Years, Kothala Rayudu Telugu Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Chiranjeevi Blockbuster Kothala Rayudu Movie, Chiranjeevi Latest Movie News

కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాలలో ‘కోతల రాయుడు’ ఒకటి. ఆవారాగా తిరిగే కథానాయకుడికి, అతని తండ్రికి మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో ‘కోతల రాయుడు’ తెరకెక్కింది. తండ్రి పాత్రలో హేమసుందర్ నటించగా… కొడుకు పాత్రను చిరంజీవి పోషించారు. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ రంగంలో తొలి అడుగులు వేశారు. శ్రీ చరిత చిత్ర పతాకంపై రూపొందిన ఈ సినిమాలో చిరుకి జోడిగా మాధవి నటించగా హేమసుందర్, నిర్మలమ్మ, గిరిబాబు, కె.వి.చలం, మంజు భార్గవి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి డా.సి.నారాయణరెడ్డి, వీటూరి, జాలాది, చక్రవర్తి గీతరచయితలు కాగా… చక్రవర్తి స్వరకల్పన చేసారు. ఇందులోని “ఒక నెలవంక”, “ఎండావానా పెళ్ళాడే”, “గో గో”, “పువ్వులోయ్ పువ్వులు” వంటి పాటలు విశేషాదరణ పొందాయి. 1979 సెప్టెంబర్ 15న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `కోతల రాయుడు’… నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here