హీరోగా వినాయక్ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు..!

VV Vinayak New Movie Launch Date Locked,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,VV Vinayak New Movie,Director VV Vinayak New Movie Updates,VV Vinayak Upcoming Movie Details,VV Vinayak Movies 2019,Latest News on VV Vinayak

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లలో వి.వి వినాయక్ ఒకరు. ఇప్పుడంటే కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చి.. తీసిన సినిమాలు కాస్త ఆడక ఫామ్లో లేరు కానీ.. ఒకప్పుడు మంచి మంచి హిట్స్ అందించారు. ఇక ఇన్నేళ్లు డైరెక్టర్ గా కనిపించిన వినాయక్.. ఇప్పుడు హీరో కొత్త అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే.
వినాయక్‌ హీరోగా త్వరలో సినిమా ప్రారంభమవుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లాంచ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 9న ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

కాగా శంకర్‌ దగ్గర పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాతో నరసింహారావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా కథ 1980ల కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. వినాయక్‌ అయితే ఈ సినిమాకు సరిగా సరిపోతాడని.. దిల్ రాజు స్వయంగా మాట్లాడి వినాయక్‌ ను హీరోగా ఒప్పించాడట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. చూద్దాం మరి డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందించిన వినాయక్ హీరో గా సక్సెస్ అవుతాడో? లేదో?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =