వరుస సినిమాలతో బిజీ అవుతున్న ‘మహానటి’

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Keerthy Suresh Gets Busy With Back To Back Movies, Keerthy Suresh Latest Movie News, Keerthy Suresh Busy With New Projects, Keerthy Suresh, Keerthy Suresh Back To Back Movies, Gorgeous Keerthy Suresh budy in Shooting, Keerthy Suresh Latest Projects

మొత్తానికి ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో ఒక్కదారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ సక్సెస్‌ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ మరింత బిజీ అవుతుంది కీర్తి సురేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ భామ ఖాతాలో చాలా సినిమాలు ఉండగా ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి న‌రేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇటీవలే ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే ను టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

దీనితో పాటు నగేష్‌ కుక్కునూరు దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితో పాటు మలయాళంలో ‘మరక్కార్‌: ది అరభికడలింటే సింహమ్‌’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది కీర్తి సురేష్.

ఈ సినిమాలతో పాటు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఎమోషనల్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న మరో సినిమాలో నటిస్తుంది. ఈ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో కార్తికేయ సంతానం నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కొడైకెనాల్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్‌.

మొత్తానికి కీర్తి సురేష్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఎలా ఇలా భాషా భేదం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుంది..?ఏ సినిమా ఫట్ అవుతుందో చూద్దాం..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =