ఫైనల్లీ #Akhil4 సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Heroine Fixed For Akhil Next Movie, Star Heroine in Akhil next, Pooja Hegde for Akhil Akkineni, Akhil Akkineni Forth Film Updates, Akhil Akkineni Latest Movie News, Pooja Hegde joins Akhil Akkineni's fourth film as lead actress , Pooja Hegde signs her next opposite Akhil Akkineni

మొత్తానికి ఎన్నో వార్తలు, రూమర్లు తర్వాత అక్కినేని అఖిల్ నాలుగో సినిమాలో హీరోయిన్ ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఎప్పటినుండో అఖిల్ నాలుగో సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ముందు రష్మిక మందనా, నివేదా పేతురాజ్, పూజ హెగ్డే, కేతిక శర్మ ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా పూజ హెగ్డే ను హీరోయిన్ గా ఖరారు చేశారు చిత్రయూనిట్. ఎప్పటి నుంచో పూజానే కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ వార్తలుగానే మిగిలాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నిటికీ బ్రేక్ పడింది. ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఎప్పటినుండో మంచి హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్ కోరిక ఈ సినిమాతో అయినా తీరుతుందో..? లేదో..? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 7 =