బ్లాక్ బస్టర్ మూవీ ‘బొబ్బిలి రాజా’కి 29 ఏళ్ళు

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, 29 Years For Venkatesh Blockbuster Bobbili Raja Movie, Venkatesh Blockbuster Bobbili Raja Movie, Bobbili Raja Telugu Movie, Venkatesh Latest movie News, Bobbili Raja Movie Completed 29 Years, 29 Years For Bobbili Raja Movie

విక్టరీ వెంకటేష్, సురేష్ ప్రొడక్షన్స్ (వెంకటేష్ హోమ్ బ్యానర్) కాంబినేషన్‌లో పలు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. వాటిలో ‘బొబ్బిలి రాజా’ ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో… వెంకీకి జోడిగా దివ్య భారతి(డెబ్యూ ఫిల్మ్) నటించగా… “కళాభినేత్రి” వాణిశ్రీ, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్, గుమ్మడి వెంకటేశ్వర రావు, సుమిత్ర, శివాజీ రాజా తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుంచి జాలు వారిన పాటలకు… మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పన చేసారు. “బలపం పట్టి”, “కన్యాకుమారి”, వద్దంటే వినడే”, “చెమ్మచెక్క చెమ్మచెక్క”, “అయ్యో అయ్యో అయ్యయ్యో”… ఇలా అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను విశేషంగా అల‌రించాయి. ఇళయరాజాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డును అందించిన ఈ చిత్రాన్ని… హిందీలో ‘బాయ్ ఫ్రెండ్’ పేరుతో రీమేక్ చేసారు. 1990 సెప్టెంబర్ 14న విడుదలై బ్లాక్ బస్టర్ మూవీగా నిలచిన `బొబ్బిలి రాజా’… నేటితో 29 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eight =