అక్కినేని అఖిల్ ‘సిసింద్రీ’కి 24 ఏళ్ళు

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, 24 Years For Sisindri Movie, Sisindri Movie, Sisindri Movie Completed 24 Years, 24 Glorified Years For Sisindri, 24 years for Blockbuster Moie Sisindri, Nagarjuna Starrer Sisindri Movie

బుడిబుడి అడుగుల ప్రాయంలో ఉన్నప్పుడు… అక్కినేని నాగార్జున తనయుడు, నేటి యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ‘సిసింద్రీ’. హాలీవుడ్ మూవీ ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను… గ్రేట్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమని, శరత్ బాబు, గిరిబాబు, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముఖ్య పాత్రలు పోషించగా… నాగార్జున, టబు, పూజా బాత్రా అతిథి పాత్రల్లో మెరిసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచనలో… రాజ్ (రాజ్-కోటి ద్వయంలో ఒకరు) స్వరపరిచిన పాటలు విశేషాదరణ పొందాయి. “చిన్ని తండ్రి నిను చూడగా”, “ఆటాడుకుందాం రా”, “హలో పిల్లా”, ‘క్యా సీన్ హై” వంటి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1995 సెప్టెంబర్ 14న విడుదలైన ‘సిసింద్రీ’… నేటితో 24 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =