అఖిల్ కి జోడిగా ‘ఇస్మార్ట్’ బ్యూటీ?

Akhil Akkineni New Movie News, Akhil Akkineni Next Film Updates, Akhil Akkineni to join hands with Priyanka Jawalkar, Akhil Akkineni Upcoming Movie News, iSmart Beauty To Pair Up With Akhil Akkineni, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. అయితే… రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తోనే ఈ టాలెంటెడ్ బ్యూటీ తొలి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నభా… మాస్ మహారాజా రవితేజకి జోడిగా ‘డిస్కో రాజా’లో నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈలోపే ఈ టాలెంటెడ్ బ్యూటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… అఖిల్ కథానాయకుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా నటించే ఛాన్స్ నభా నటేష్ కి దక్కిందని తెలిసింది. త్వరలోనే నభా నటేష్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here