కంగనా ‘జయలలిత’ కోసం కెప్టెన్ మార్వెల్ మేకప్ ఎక్స్పర్ట్..!

Hollywood make-up artist Jason Collins to transform Kangana Ranaut into Jayalalithaa, Hollywood makeup expert for Jayalalithaa Biopic, Hollywood Makeup Expert Jason Collins for Jayalalithaa Biopic, Kangana Ranaut to sport 4 looks for J Jayalalithaa biopic; Captain Marvel fame Jason Collins to do prosthetics, Kangana Ranaut to Work With Captain Marvel Makeup Artist in J Jayalalithaa Biopic, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె సినీ జీవితంతో పాటు.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇక ఇటీవలే . ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని అలాగే సినిమా 2020 మేలో తెరపైకి రానుందని చెప్పారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో హాలీవుడ్ మేకప్ ఎక్స్పర్ట్ ను తీసుకున్నారట. జయలలిత సినిమా కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. దీనితో కెప్టెన్ మార్వెల్, బ్లేడ్ రన్నర్ సినిమాలకు పనిచేసిన మేకప్ ఎక్స్పర్ట్ జాసన్ కాలిన్స్ ను ఈ సినిమా కోసం తీసుకురనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఏం పత్రాలు పోషిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే కంగనా తమిళ్ నేర్చుకున్నట్టు వార్తలు రాగా.. ఇప్పుడు భరతనాట్యం కూడా నేర్చుకుంటుందట. చూద్దాం మరి ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో..!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here